📄 ePaper
Sunday, July 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyజోగిపేట లో నీట్ పేపర్ లీకేజ్ నిరసనగా భారీధర్నా విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి మున్సిపల్ చైర్మెన్...

జోగిపేట లో నీట్ పేపర్ లీకేజ్ నిరసనగా భారీధర్నా విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి మున్సిపల్ చైర్మెన్ కృష్ణారెడ్డి

📰 Generate e-Paper Clip

జోగిపేట లో నీట్ పేపర్ లీకేజ్ నిరసనగా భారీధర్నా

విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి మున్సిపల్ చైర్మెన్ కృష్ణారెడ్డి


మనసముద్ర ప్రజావాణి జూలై 26(జోగిపేట )
సంగారెడ్డి జిల్లా ప్రతినిది

జోగిపేట పట్టణములో శనివారం  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని హనుమాన్ చౌరస్తాలో నీట్ విద్యార్థులకు మద్దతుగా పెద్దఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భముగా మున్సిపల్ చైర్మెన్ యస్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల వేలాది మంది అమాయక విద్యార్థులు బలి అయ్యారు.
దీనికి నిరసనగా ఢిల్లీ లో ఉద్యమo చేస్తున్న నీట్ విద్యార్థులపై విచక్షణ రహితంగా లాఠీఛార్జ్ చేసి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు అన్నారు.ఢిల్లీ లో నీట్ విద్యార్థుల తరుపున ధర్నా చేస్తున్న  ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పైన కేంద్ర ప్రభుత్వం విచక్షణ రహితంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేసింది తక్షణమే చనిపోయిన నీట్  విద్యార్థులకు ఒక్కరికి కోటి రూపాయల చొప్పున సహాయం అందించాలి తక్షణమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండు చేశారు.

ఈ కార్యక్రమములో మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్,జిల్లా నాయకులు డాకూరి వెంకటేశం, కౌన్సిలర్స్ కోశికే రాజశేఖర్,మాజీ కౌన్సిలర్స్ పట్లోళ్ల ప్రవీణ్,కోరబోయిన నాగరాజు నాని,తుపాకుల సునీల్,గొల్ల శరత్ బాబు,కో ఆప్షన్ మెంబెర్స్ జీషాన్,ప్రవీణ్,ఆత్మ కమిటీ సభ్యుడు ఖాలేదు నాయకులు రాజిరెడ్డి,డాకూరి శ్రీనివాస్,చింతకుంట శివ,బేగారి అనిల్, సైలాన్,గొహేర్ అలీ,కొత్త శ్రీశైలం,ఆకుల నందు,యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్,పృథ్విరెడ్డి,చోటు,తేజగౌడ్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular