విద్యార్థుల ఉద్యమానికి విజయం.. కేంద్రం–సీజేపీ ఒప్పందం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి
షాద్‌నగర్, జూలై 25 (ప్రజావాణి):
ప్రజా సమస్యలను ప్రారంభం నుంచే చర్చల ద్వారా పరిష్కరించి ఉంటే దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆందోళనలు నివారించేవని కాంగ్రెస్ నాయకురాలు తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి అన్నారు. ప్రజల గొంతును అణిచివేయడం, నిరసనలను నిర్లక్ష్యం చేయడం కంటే సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించడమే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఆలస్యమైనా కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకు వచ్చి సీజేపీతో ఒప్పందానికి రావడం సానుకూల పరిణామమేనని, అయితే ఒప్పందంలో ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో నిర్దిష్ట కాలవ్యవధిలో అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ప్రజల గొంతును వినడం, చర్చలకు ప్రాధాన్యం ఇవ్వడం, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమాలకు అండగా నిలుస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి కోరారు.
విద్యార్థుల ఉద్యమానికి విజయం కేంద్రం–సీజేపీ ఒప్పందం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి
RELATED ARTICLES




