📄 ePaper
Friday, July 24, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliరామగుండం గురుకుల కళాశాలకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి

రామగుండం గురుకుల కళాశాలకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి

📰 Generate e-Paper Clip

 

రామగుండం మహిళా గురుకుల కళాశాల అభివృద్ధికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గురుకుల పేరెంట్స్ కమిటీ నాయకులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, అడిషనల్ కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీలను కలిసి వినతిపత్రం అందజేశారు.

కళాశాలకు గతంలో మిషన్ భగీరథ నీటి సౌకర్యం, రోడ్డు మరమ్మతులు, కుట్టు మిషన్లు, వాటర్ ఫ్రిజ్ ఏర్పాటు చేయడంతో పాటు కళాశాల ఆవరణలో శుభ్రత పనులు చేపట్టినందుకు వారికి పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఆర్వో ప్లాంట్, స్టీమ్ మిషన్ ఏర్పాటు, కళాశాల మొత్తం పెయింటింగ్, ప్రహరీ గోడల ఎత్తు పెంపు, పూర్తిస్థాయి లైటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ కన్నం నవీన, వైస్ చైర్మన్ శైలజ, ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, కోశాధికారి రజిత, సలహాదారులు దుర్గం ఉషారాణి, మురళి, మాధవి, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular