📄 ePaper
Friday, July 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జూలై 29న బెజ్జంకి మండల బంద్ విజయవంతం చేయండి -అఖిలపక్ష నాయకుల పిలుపు

జూలై 29న బెజ్జంకి మండల బంద్ విజయవంతం చేయండి -అఖిలపక్ష నాయకుల పిలుపు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, జూలై 24 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుగ్గిళ్ల–పోతారం శివార్లలో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న బెజ్జంకి మండల బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల తీవ్రమైన దుర్వాసన, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం ఏర్పడి మండల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఫ్యాక్టరీలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.జులై 29న చేపట్టనున్న మండల బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు, కుల సంఘాలు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ, డీఎస్పీ, బీఎస్పీ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular