జూలై 29న బెజ్జంకి మండల బంద్ విజయవంతం చేయండి -అఖిలపక్ష నాయకుల పిలుపు

  బెజ్జంకి, జూలై 24 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుగ్గిళ్ల–పోతారం శివార్లలో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న బెజ్జంకి మండల బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల తీవ్రమైన దుర్వాసన, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం ఏర్పడి మండల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఫ్యాక్టరీలను వెంటనే...