📄 ePaper
Tuesday, July 14, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyజాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం

జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం

📰 Generate e-Paper Clip

జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం

బీర్కూర్ మండలం, బైరాపూర్: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా బైరాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎల్‌కేజీ నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, గోర్లు కొరకకుండా ఉండడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పాఠశాల ఆవరణతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై ఆరోగ్య అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం శ్రీమతి ఝాన్సీ రాణి, ఎంఎల్‌హెచ్‌పీ ప్రీతి, ఆశా కార్యకర్త జయ, ఎస్‌జీటీ రచన పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular