జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం
జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం బీర్కూర్ మండలం, బైరాపూర్: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా బైరాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎల్‌కేజీ నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, గోర్లు కొరకకుండా ఉండడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పాఠశాల ఆవరణతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై ఆరోగ్య అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం శ్రీమతి ఝాన్సీ రాణి,...