📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetజర్నలిస్ట్ కర్రోళ్ల అన్నమ్మకు దళిత రత్న అవార్డు ప్రధానం..

జర్నలిస్ట్ కర్రోళ్ల అన్నమ్మకు దళిత రత్న అవార్డు ప్రధానం..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట్, ఏప్రిల్ 19, ప్రజావాణి

భారత రాజ్యాంగం నిర్మాణ కర్త, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని అంబేద్కర్ కళ భవనంలో బాబు జగ్జీవన్ రావ్, బిఆర్ అంబేద్కర్ ఉత్సవాల కమిటీ, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కో చైర్మన్ సుదర్శన్ బాబు, దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్, చేతుల దళిత రత్న అవార్డును అందుకోవడం జరిగింది.సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటు, దళిత జర్నలిస్టుల పోరంలో దళిత జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ముందుకు వెళ్తున్న సందర్బంగా వాళ్ల సేవలను గుర్తించి దళిత రత్న అవార్డుకు ఎంపిక కావడం జరిగిందని కర్రోళ్ల అన్నమ్మ తెలిపారు. ఈ అవార్డు ద్వారా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ అవార్డుకు కృషి చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి, ఉత్సవాల కమిటీ సభ్యులకు, దళిత జర్నలిస్టుల పోరం కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular