జంపన్నవాగులో గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు – జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ పరిశీలన

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జంపన్నవాగులో ప్రమాదవశాత్తు గల్లంతైన వ్యక్తి కోసం పోలీసు, ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF) బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.బుధవారం జంపన్నవాగు ప్రధాన వంతెన నుంచి ఊరట్టం వంతెన మధ్య ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో నీటిలో ఈతకు దిగిన పీట్ల తిమ్మయ్య (45), తండ్రి రంగయ్య, వడ్డెర, వృత్తి: కారు డ్రైవర్, స్వస్థలం: కొండాపూర్ గ్రామం, ఘట్‌కేసర్ మండలం...