📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetచీలాపూర్ గ్రామానికి 15 సోలార్ స్ట్రీట్ లైట్లు అందజేత

చీలాపూర్ గ్రామానికి 15 సోలార్ స్ట్రీట్ లైట్లు అందజేత

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, మే 7 (ప్రజావాణి) :

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని చీలాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో జేఎస్‌డబ్ల్యూ సోలార్ ప్లాంట్ ఆధ్వర్యంలో 15 సోలార్ స్ట్రీట్ లైట్లను గ్రామానికి అందజేశారు. ఈ సందర్భంగా సంబంధిత వారంటీ కార్డులను గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరచారికి సంస్థ ప్రతినిధులు అందించారు.ఈ కార్యక్రమంలో సీఎస్ఆర్ సీనియర్ మేనేజర్ సంతోష్, జేఎస్‌డబ్ల్యూ క్లస్టర్ మేనేజర్ సంతోష్ మంగరాజు, సోలార్ ప్లాంట్ ఇంచార్జ్ సురేష్ పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడే విధంగా సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular