*చిలుకూరు జూలై 30 (ప్రజావాణి*): జిల్లాలో పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ నరసింహ చిలుకూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ముందుగా పోలీసు స్టేషన్ సిబ్బంది ఎస్పీ గారికి గౌరవ వందనంతో స్వాగతం తెలిపినారు, పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాలు పరిశీలించి. సిబ్బంది చక్కని యూనిఫామ్, క్రమశిక్షణ, పోలీస్ పరికరాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకోని ఎలాంటి సమస్య ఉన్న అధికారుల ద్వారా పరిష్కరించుకావాలని సూచించి సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడు కృషి చేస్తామని తెలిపారు. స్టేషన్ అవరణంలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ నందు రికార్డుల నిర్వహణ,ఆన్లైన్ ఫిర్యాదుల నిర్వహణను పరిశీలించారు. గత మూడు సంవత్సరాలుగా నమోదు అవుతున్న నేరాల తీరును తనిఖీ చేసి నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించడం జరిగింది. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారి సమస్యలు విని వారికి భరోసా కల్పించాలని,ధైర్యం కల్పించాలని సూచించారు. ప్రాథమిక విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపి,ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేసి ప్రజలకు నమ్మకం కలిగించాలని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్దకే వెళ్లి పోలీస్ సేవలను అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నందు నిర్వహిస్తున్న రికార్డ్స్ ను తనిఖీ చేసినారు. కేసులు పెండింగ్ ఉండకుండా ఎప్పటికప్పుడు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. మండల పరిధిలో తరచుగా నేరాలకు పాల్పడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పటిష్టంగా ఉంచి బైండోవర్ చేయడం షీట్స్ నమోదు చేయడం లాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించి మండల పరిధిలో ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టడానికి ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. సమస్యలపై ఫిర్యాదులు అందుకున్న వెంటనే బాధితుల ఇంటికి వెళ్లి అక్కడినుండే కేసులు నమోదు చేయాలని తెలిపారు.నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించి నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దుం అలీ, స్థానిక ఎస్సై బండి మోహన్ బాబు, స్టోర్ ఆర్ఎస్ఐ అశోక్, డిసిఆర్బి సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సీసీ సందీప్, ఐటి కోర్ కానిస్టేబుల్ సురేందర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
*చిలుకూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేసిన ఎస్పీ నర్సింహా*
RELATED ARTICLES



