📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
HomeతెలంగాణMahabubabadఉద్యమకారుల ఫోరం జిల్లా సంయుక్త కార్యదర్శిగా చంద్రమౌళి గౌడ్

ఉద్యమకారుల ఫోరం జిల్లా సంయుక్త కార్యదర్శిగా చంద్రమౌళి గౌడ్

📰 Generate e-Paper Clip

.
ప్రజావాణి,నెల్లికుదురు:తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహబూబాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ ఎంపికయ్యారు.ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చీమ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ ల ఆదేశాల మేరకు మానుకోట జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర్లు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి అందజేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చంద్రమౌళి గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ నేతగా  కీలక పాత్ర పోషించారు.తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటానికి స్వయంగా ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యమకారులకు దిశా నిర్దేశం చేస్తూ, అనేకచోట్ల ప్రజలను ప్రేరేపించి సమాయత్త పరిచారు. ఆయన ఉద్యమ పోరాట పటిమ గుర్తించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అగ్ర నాయకులు జిల్లా జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి గౌడ్ మాట్లాడుతూ తనను ఈ కీలక పదవిలో నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రజనీకాంత్ లతోపాటు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు కుమ్మరి కుంట్ల మౌనేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపులో పారదర్శకంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఫోరం మండల అధ్యక్షులు కుమ్మరి కుంట్ల మౌనేందర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular