చండ్రుగొండ మండల అధికారులతో ఎమ్మెల్యే జారే సమీక్ష సమావేశం
చండ్రుగొండ, మన ప్రజావాణి, ఏప్రిల్ 27:
కాంగ్రెస్ ప్రభుత్వ 99 రోజుల ప్రణాళిక లో భాగంగా చండ్రుగొండ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ,ప్రజలకు అందించే త్రాగునీరు సరఫరా, ధాన్యంకొనుగోలు,పౌరసరఫరాల,పంతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి మరియు అభివృద్ధి సేవల పట్ల నిబద్ధతతో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రణాళిక బద్ధంగా సమస్యల పరిష్కారం కొరకు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ చండ్రుగొండ మండలని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చెయ్యాలని అధికారులతో సమీక్షించడం జరిగింది మరియు వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండల వ్యాప్తంగా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయం కలిగితే తక్షణమే పరిష్కారం చూపడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నిరంతరంగా తాగునీరు అందేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ అశోక్ కుమార్,ఏంఆర్ఓ జగదీష్ ప్రసాద్, ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


