ఘనంగా సమ్మర్ క్యాంప్ – 2026 ప్రారంభం
.. విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో
మందమర్రి,( మన ప్రజావాణి) మే 11:
మందమర్రి మోడల్ స్కూల్ లో ఘనంగా సమ్మర్ క్యాంప్ – 2026 ప్రారంభించారు.తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ మందమర్రిలో నిర్వహిస్తున్న “సమ్మర్ క్యాంప్ – 2026” కార్యక్రమాన్ని సోమవారం రోజున ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల రెవెన్యూ అధికారి సతీష్ కుమార్ శర్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్, మండల విద్యాధికారి రమేష్ రాథోడ్, ఏఏపిసి చైర్మన్ జ్యోతి, వేసవి శిబిరం ఇంచార్జ్ రజిని లు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
అలాగే మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సమ్మర్ క్యాంప్ మే 11వ తేదీ నుండి మే 25వ తేదీ వరకు మొత్తం 15 రోజుల పాటు నిర్వహించబడుతుంది అని తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆర్ట్ & క్రాఫ్ట్, డాన్స్, యోగా, స్టిచింగ్, ఇండోర్ గేమ్స్ వంటి పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మందమర్రి మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమ్మర్ క్యాంప్‌లో చేరి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలని కోరారు.
ఘనంగా సమ్మర్ క్యాంప్ – 2026 ప్రారంభం
RELATED ARTICLES




