📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్కేసర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడి పెళ్లిరోజు వేడుకలు

ఘట్కేసర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడి పెళ్లిరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, ఏప్రిల్ 27 (ప్రజావాణి): ఘట్కేసర్ మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి మరియు వారి సతీమణి కొమ్మిడి శిరీష 20వ వివాహ వార్షికోత్సవాన్ని సోమవారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. దంపతులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు.

పార్టీ నాయకులు మాట్లాడుతూ, కొమ్మిడి మహిపాల్ రెడ్డి ప్రజలకు సేవ చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి దాంపత్య జీవితం ఇలాగే సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular