📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్కేసర్‌లో బీజేపీ భారీ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ బిజెపి శ్రేణులు

ఘట్కేసర్‌లో బీజేపీ భారీ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ బిజెపి శ్రేణులు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, మే 4: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి నాయకత్వం వహించారు.

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, దేశ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు చెల్లక శ్రీధర్, మంగు రాధిక, ఉపాధ్యక్షులు గుండ్ల రామతీర్థ, పడిగం వీరేశం, పసులది చంద్రశేఖర్, కార్యదర్శి సిద్దిరాజు, కోశాధికారి మేడబోయిన నరేష్, సహ కోశాధికారి పవన్ సింగ్, యువ మోర్చా నాయకుడు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, కొమ్మిడి శోభ దామోదర్ రెడ్డి, సీనియర్ నాయకులు పల్లె మధుసూదన్, ఎదుగాని శ్రీరాములు, జైపాల్ రెడ్డి, దేశం అభిమన్యు గౌడ్, మాధవి, శోభన్ బాబు మరియు బూత్ అధ్యక్షులు కంది ప్రవీణ్, చలపతిరావు, కోమటి శరత్, నరసింహారెడ్డి, మమత శర్మ, రేఖ సోని, సుదర్శన్ జి, హర్ష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular