ఘట్కేసర్‌లో బీజేపీ భారీ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ బిజెపి శ్రేణులు
ఘట్కేసర్, మే 4: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి నాయకత్వం వహించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ...