📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగన్నేరువరం SWC గోదాముకు వడ్ల తరలింపు ఏర్పాట్లు చేసిన -బెజ్జంకి తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్

గన్నేరువరం SWC గోదాముకు వడ్ల తరలింపు ఏర్పాట్లు చేసిన -బెజ్జంకి తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,మే 28(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రైస్ మిల్లులు దాదాపు పూర్తిస్థాయిలో వడ్లతో నిండిపోవడంతో నిల్వ సమస్యను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు మండలంలోని అధిక నిల్వ ఉన్న ఐకేపీ, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాల వడ్లను గన్నేరువరం మండలంలోని ఎస్‌డబ్ల్యూసీ (State Warehousing Corporation) గోదాముకు తరలించేందుకు ట్యాగింగ్ చేసినట్లు బెజ్జంకి తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్ తెలిపారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి AMC, దాచారం, గుండారం, కల్లేపల్లి, పేరుకబండ, వడ్లూర్, లక్ష్మిపూర్-1 ప్యాక్స్ కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్లను గన్నేరువరం SWC గోదాముకు తరలించే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.మొత్తం 25 వేల క్వింటాళ్ల వడ్ల నిల్వను గన్నేరువరం SWC గోదాముకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు, నిల్వ ప్రక్రియలను వేగవంతంగా నిర్వహిస్తున్నామని తహసీల్దార్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular