📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగుగ్గిళ్ల లో ఘనంగా బక్రీద్ పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు

గుగ్గిళ్ల లో ఘనంగా బక్రీద్ పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, మే 28 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గురువారం ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, స్థానికంగా వేలాదిమంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు.ప్రార్థనల అనంతరం ముస్లిం పెద్దలు బక్రీద్ పండుగ యొక్క పవిత్రత, త్యాగం, సేవాభావం వంటి విలువలపై ప్రసంగించారు. పండుగను కేవలం ధార్మిక వేడుకగానే కాకుండా సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం మరియు సేవా భావాన్ని పెంపొందించే సందర్భంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.అనంతరం వివిధ రాజకీయ నాయకులు ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular