📄 ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గంజాయి,ఇతర మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్...

గంజాయి,ఇతర మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహణ,

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) తెనాలి 1టౌన్ పోలీస్ స్టేషన్ గుంటూరు  జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు,జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్ల డీఎస్పీల పర్యవేక్షణలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది.తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు సారథ్యంలో తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠపురం గ్రామంలోని రైల్వే ట్రాక్ సమీపంలోని గృహాల సముదాయంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించి,అనుమానితులు, పాత నేరస్తులను విచారణ చేసి,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో సరైన వాహన ధ్రువపత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలను,8 ఆటోలను గుర్తించడం జరిగింది. గంజాయి అమ్మకం, సరఫరాకు సంబంధించిన సమాచారం మేరకు ఈ ఆపరేషన్లు చేపట్టామని,శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెనాలి డిఎస్పీ శ్రీ జనార్దన్  తెలిపారు.స్థానికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి,గంజాయి సహా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. మత్తు పదార్థాల కారణంగా యువత భవిష్యత్తు నాశనం అవుతుందని,కుటుంబాల్లో కలహాలు పెరుగుతాయని,సమాజంలో నేరాలు అధికమవుతాయని అవగాహన కల్పించారు.ముఖ్యంగా యువతను సరైన మార్గంలో నడిపించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని డీఎస్పీ స్పష్టం చేశారు.గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు మరియు స్థానికులతో ప్రమాణం చేయించారు.రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని,ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఎలాంటి చర్య తీసుకోవడానికైనా వెనుకాడబోమని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.గంజాయి నిర్మూలన దిశగా ఇలాంటి ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని గంజాయి కార్యకలాపాలలో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.గంజాయి రహిత జిల్లాగా గుంటూరును తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు విశేష కృషి చేస్తున్నారని,ప్రజలు కూడా తమ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు గారితో పాటు తెనాలి 1వ పట్టణ సీఐ మల్లిఖార్జునరావు, తెనాలి 2వ పట్టణ సీఐ రాములు నాయక్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular