కళ్యాణదుర్గం జూన్ 09 ప్రజావాణి నియోజకవర్గంలో జరుగుతున్న మద్యం దోపిడీపై మాజీ ఎంపీ, సమన్వయకర్త తలారి రంగయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు,ఈ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి మద్యం బాటిల్‌పై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనంగా రూ. 30 నుండి రూ. 60 వరకు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.ఈ అక్రమ వసూళ్లకు సంబంధించిన పక్కా ఆధారాలను, సాక్ష్యాలను తలారి రంగయ్య మీడియా ముఖంగా ప్రదర్శించి సంచలనం సృష్టించారు,కళ్యాణదుర్గంలోని YSRCP కార్యాలయంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసిపి సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొని.. నియోజకవర్గంలో జరుగుతున్న మద్యం దోపిడీపై పక్కా ఆధారాలతో సంచలన విషయాలను బట్టబయలు చేశారు,ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ.పేద ప్రజల రక్తాన్ని పిండి, బెల్ట్ షాపుల ద్వారా వసూలు చేస్తున్న ఈ అక్రమ సంపాదనంతా నేరుగా ఎమ్మెల్యే సురేంద్రబాబు జేబుల్లోకే వెళ్తోంది” అని నిప్పులు చెరిగారు. పక్కా ప్రణాళికతో నియోజకవర్గంలో మద్యం మాఫియాను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.ప్రజల నుండి అక్రమంగా వసూలు చేసిన ఈ పాపపు సొమ్మును ఎమ్మెల్యే సురేంద్రబాబు తన సొంత నిధులుగా చిత్రీకరించుకుంటున్నారని రంగయ్య విమర్శించారు.ఈ దోపిడీ డబ్బుతో గుళ్లకు,గోపురాలకు,విగ్రహాలకు విరాళాలు ఇస్తూ.తన స్వార్థ రాజకీయాల కోసం “సొంత నిధులు,సొంత డబ్బా”అంటూ కలరింగ్ ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఈ మద్యం దోపిడీ వెనుక ఉన్న అసలు నిజాలను,ఎమ్మెల్యే సురేంద్రబాబు నకిలీ దానాల వెనుక ఉన్న అక్రమ సంపాదనను ప్రజలంతా గమనించాలని,ఈ అవినీతి పాలనపై తిరగబడాలని తలారి రంగయ్య పిలుపునిచ్చారు
Homeఆంధ్రప్రదేశ్కళ్యాణదుర్గంలో మద్యం మాఫియా దందా..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గుట్టు రట్టు చేసిన మాజీ ఎంపీ, సమన్వయకర్త...
కళ్యాణదుర్గంలో మద్యం మాఫియా దందా..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గుట్టు రట్టు చేసిన మాజీ ఎంపీ, సమన్వయకర్త తలారి రంగయ్య
0
21
RELATED ARTICLES




