కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి,తనిఖీలు 

గూడూరు జూలై 02 ప్రజావాణి మండలంలోని గుడిపాడు అంగన్వాడి కేంద్రం మరియు గూడూరులోని జూనియర్ కళాశాలను తనిఖీ చేయడం జరిగినది.గుడిపాడు అంగన్వాడి కేంద్రంలో కోడిగుడ్లను పరిశీలించగా,వాటి బరువు నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.దీనిపై అంగన్వాడి నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కోడిగుడ్లను సరఫరా చేయాలని ఆదేశించారు. తదనంతరం గూడూరు అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేయగా,అంగన్వాడి కార్యకర్త హాజరు నమోదును సక్రమంగా నిర్వహించకపోవడం గమనించారు.ఈ నిర్లక్ష్యంపై సంబంధిత సూపర్వైజర్ ద్వారా అంగన్వాడి కార్యకర్తకు షోకాజ్ నోటీసు జారీ...