
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) కడప నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో రాయలసీమ రీజియన్ హోమ్ గార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ గారు హోంగార్డ్స్ పెరేడ్ ను పరిశీంచడం జరిగింది.తరువాత దర్బార్ లో హోంగార్డ్స్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ…పోలీసు వ్యవస్థలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని, విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ శాఖ ప్రతిష్టను పెంచేలా పని చేయాలని సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హోంగార్డు కమాండెంట్ హోంగార్డుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి సమర్థవంతంగా సేవ చేయగలరన్నారు.అలాగే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ప్రయాణాల్లో జాగ్రత్తలు వహిస్తూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ వ్యక్తి గత ఇన్స్యూరెన్స్ లు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం నిర్వహించిన ‘దర్బార్’లో హోంగార్డులు తమ సమస్యలను కమాండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యలను జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అలాగే హోంగార్డ్స్ కు సంబదించిన వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో ఏ.ఆర్ అడిషనల్ ఎస్.పీ శ్రీ బి.రమణయ్య గారు, ఏ.ఆర్ డి.ఎస్.పీ శ్రీ పి.నాగేశ్వర రావు గారు, హోంగార్డు డిఎస్పీ ప్రసాద్ గారు, హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్.ఐ శ్రీశైల రెడ్డి, హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు


