📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వజ్రప్రహార్‌తో గంజాయిపై పోలీసుల కఠిన చర్యలు

వజ్రప్రహార్‌తో గంజాయిపై పోలీసుల కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో గంజాయి నిర్మూలనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్, ఐపీఎస్ మరియు కళ్యాణదుర్గం డీఎస్పీ ఆదేశాల మేరకు యు.పి.ఎస్ పరిధిలో వజ్రప్రహార్ ప్రత్యేక డ్రైవ్‌ను శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని అనుమానాస్పద గృహాలు,రౌడీషీటర్ల నివాసాలను పోలీసులు సవివరంగా తనిఖీ చేశారు.అలాగే గ్రామ ప్రజలను ఒకేచోట సమీకరించి గంజాయి,నాటు సారా,జూదం వంటి అక్రమ కార్యకలాపాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.గంజాయి వినియోగం నిల్వ, రవాణా వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించిన పోలీసులు,ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించిన వారికి గోప్యత కల్పిస్తామని తెలిపారు.గ్రామ ప్రజలతో పోలీసులకు సహకరించాలనే ప్రతిజ్ఞ చేయించారు.ఈ డ్రైవ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి జరిమానాలు విధించారు.ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం గ్రామీణ యుపీఎస్ ఇన్‌స్పెక్టర్ గణేష్, శెట్టూరు ఎస్సై, బ్రహ్మసముద్రం ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular