ఏఐటీయూసీ జిల్లా మహాసభను జయప్రదం చేయండి.
మఠంపల్లి జూలై 30 (ప్రజావాణి)
ఈనెల 1వ తేదీన సూర్యాపేట జిల్లా ఏఐటీయూసీ మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ పత్రిక సమావేశంలో తెలిపారు. మఠంపల్లి మండల కేంద్రంలో కార్మికులతో జిల్లా మహాసభల కరపత్రాన్ని రిలీజ్ చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్రానికి పూర్వమే కార్మికుల హక్కుల కోసం కార్మికుల పక్షాన పోరాడే ఉద్దేశంతో ఏర్పడినటువంటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని, నాటి నుండి నేటి వరకు అనేక సమరశీల పోరాటం ద్వారా కార్మికుల హక్కులను సాధించుకున్న ఏకైక సంఘం ఏఐటీయూసీ అని ఆయన అన్నారు. నేటి బిజెపి ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యతిరేక భావంతో వారి హక్కుల కు భంగం కలిగిస్తుంది. సాధించుకున్న చట్టాలను రద్దు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడలను తక్షణమే రద్దు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ ప్రాంతీయ ఉపాధ్యక్షులు సయ్యద్ రన్ మియా, సహాయ కార్యదర్శి దేశ బోయిన వీరయ్య, ఏఐటీయూసీ మండల నాయకులు, అధ్యక్షులు చిన్న పొంగు శ్రీను, ఎస్.కె భగవాన్ కొత్తపల్లి విశాఖ ఎస్కే మూస, మాతంగి కొండలు, దుగ్గి సైదులు, ఎస్.కె మదర్, తెల్లబాటి సత్యనారాయణ, రెడపంగు లాజర్ పీవీ నరసింహారావు, వల్లభ దాస్ వీరబాబు, ఎస్కే సైదిల్లి తదితరులు పాల్గొన్నారు.




