ఏఐటీయూసీ జిల్లా మహాసభను జయప్రదం చేయండి.
ఏఐటీయూసీ జిల్లా మహాసభను జయప్రదం చేయండి. మఠంపల్లి జూలై 30 (ప్రజావాణి) ఈనెల 1వ తేదీన సూర్యాపేట జిల్లా ఏఐటీయూసీ మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ పత్రిక సమావేశంలో తెలిపారు. మఠంపల్లి మండల కేంద్రంలో కార్మికులతో జిల్లా మహాసభల కరపత్రాన్ని రిలీజ్ చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్రానికి పూర్వమే కార్మికుల హక్కుల కోసం కార్మికుల పక్షాన పోరాడే ఉద్దేశంతో ఏర్పడినటువంటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని, నాటి నుండి నేటి వరకు...