📄 ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మార్వో ఆఫీస్‌లో విలేకరిపై డిప్యూటీ తాసిల్దార్ (DT) మరియు జూనియర్ అసిస్టెంట్లు దురుసుగా  ప్రవర్తన  

ఎమ్మార్వో ఆఫీస్‌లో విలేకరిపై డిప్యూటీ తాసిల్దార్ (DT) మరియు జూనియర్ అసిస్టెంట్లు దురుసుగా  ప్రవర్తన  

📰 Generate e-Paper Clip

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతాపమా?: విలేకరిపై ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది దౌర్జన్యం!

డిప్యూటీ తాసిల్దార్, జూనియర్ అసిస్టెంట్ల దురుసు ప్రవర్తన
సమాచారం ఇవ్వకుండా పోలీసులకు అక్రమ ఫిర్యాదు?
బాధ్యత మరిచి ప్రవర్తించిన అధికారులపై చర్యలకు డిమాండ్

పోరుమామిళ్ల జూన్ 5 ప్రజావాణి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే మీడియా ప్రతినిధులపై ప్రభుత్వ అధికారులు నానాటికీ దురహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ప్రజల సమస్యలను,కార్యాలయాల పనితీరును ప్రశ్నించడమే నేరమన్నట్లుగా  పోరుమామిళ్ల  తహసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో  తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలపై, కోర్టు ఆదేశాల అమలుపై బాధ్యతాయుతంగా ప్రశ్నించిన స్థానిక విలేకరిపై డిప్యూటీ తాసిల్దార్ (DT) మరియు జూనియర్ అసిస్టెంట్లు అత్యంత అనాగరికంగా దురుసుగా ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపింది.అసలేం జరిగింది?విశ్వసనీయ సమాచారం ప్రకారం కి సంబంధించిన కోర్టు పేపర్లు, అధికారిక ఉత్తర్వుల పురోగతిపై సమాచారం కోరడానికి విలేకరి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లారు. ప్రజల పక్షాన నిలబడి, సదరు డివిజనల్ టాస్క్ లేదా కోర్టు ఆర్డర్ కాపీని ఇవ్వాలని డిప్యూటీ తాసిల్దార్‌ను మర్యాదపూర్వకంగా అడిగారు. అయితే, కార్యాలయంలో జరగాల్సిన పనులను పక్కనబెట్టి, సమాధానం చెప్పడానికి నిరాకరించిన DT.విలేకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.”నువ్వు ఎవరు మాకు ప్రశ్నించడానికి? నీకు పేపర్లు ఇచ్చేదే లేదు.ముందు ఆఫీస్ నుండి బయటకు వెళ్ళు” అంటూ ఏకవచనంతో దుర్భాషలాడారు. ఇంతటితో ఆగకుండా,అక్కడే ఉన్న జూనియర్ అసిస్టెంట్లు కూడా ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ విలేకరిని చుట్టుముట్టి బెదిరింపులకు దిగారు.చట్టబద్ధమైన సమాచారాన్ని దాచిపెడుతూ, తమ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే సిబ్బంది ఈ విధంగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
తప్పు కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ ఫిర్యాదు!తమ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి లేదా అసమర్థత బయటకు రాకూడదనే ఉద్దేశంతో,డిప్యూటీ తాసిల్దార్ మరియు సిబ్బంది కలిసి విలేకరిపైనే పోలీసులకు అక్రమ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.సమాచార హక్కు చట్టం మరియు పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ,రౌడీల వలె ప్రవర్తించిన డిప్యూటీ తాసిల్దార్, జూనియర్ అసిస్టెంట్లపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తప్పు చేసిన అధికారులపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ (RDO) స్పందించి విచారణ జరపాలని, విలేకరులు కోరారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular