చిలుకూరు ఆగస్టు 01( ప్రజావాణి):సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో కోదాడ జడ్చర్ల నేషనల్ హైవే పై చిలుకూరు మండలం సీతారామపురం స్టేజి సమీపంలో ద్విచక్ర వాహనం బోలేరో ఢీ కోట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలై పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.మృతుడు మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన భూక్య నరసింహ (19)ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నారు. సీరియస్ గా ఉన్న మరో వ్యక్తి భోజ్య తండా కు చెందిన గుగులోతు గోపి రాములు అలియాస్ కొండ గా గుర్తించారు . స్థానికులు 108 ద్వారా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్ భూక్య నరసింహ మృతి చెందాడని నిర్దారించారు . గుగులోతు గోపి రాములు ఆరోగ్య పరిస్తితి అత్యంత విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.




