ఘాట్ కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎదులాబాద్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌వీకే టిఫిన్స్ అండ్ స్నాక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బండారి శ్రీనివాస్ గౌడ్, అబ్బాసాని యాదగిరి, రాజబోయిన యాదగిరి యాదవ్, సారా శ్రీనివాస్ గౌడ్, పోత్కని మల్లికార్జున రాజు, ఎక్కన్న, రమేష్, శేఖర్, మేకల పద్మారావు, ఎర్రోళ్ల సత్యనారాయణ, పల్లె విజయ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు నూతనంగా ప్రారంభమైన ఎస్‌వీకే టిఫిన్స్ అండ్ స్నాక్స్ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ జగదీష్ కు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం అతిథులు దుకాణాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న టిఫిన్స్, స్నాక్స్‌ను పరిశీలించారు.



