📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఎదులాబాద్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతి వేడుకలు 

ఎదులాబాద్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతి వేడుకలు 

📰 Generate e-Paper Clip

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతి వేడుకలు

మేడ్చల్ జిల్లా, రిక్వెస్ట్ సర్కిల్ పరిధిలోని ఎదూలబాద్ లో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ ఎదగాని కృష్ణమూర్తి పన్నాల కొండల్ రెడ్డి గాయారు విశ్వనాథ్ మాజీ ఎంపీటీసీ మంకం రవి  మాజీ ఎంపీటీసీ ఘట్టగల్ల రవి పోగు భాస్కర్ గౌడ్ ప్రవీణ్ రావు బిజెపి మండల అధ్యక్షుడు బసవరాజు గౌడ్ మాజీ ఎంపీటీసీ కరుణాకర్ చిలుకూరి మంకయ్య అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గుమ్మడి శివ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచం లోనే గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని,భారత దేశ ప్రజలకు అంబేద్కర్ దేవుడుగా నిలిచాడని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తోనే అనేక మంది ఉన్నత పదవులు చేపడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన అందించిన ఫలాలను ప్రజలందరూ అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గుమ్మడి శివ కుమార్ ఉపాధ్యక్షులు బద్దం వెంకటేష్ గుమ్మడి ధనుంజయ గన్ వల్ల మల్లేష్ కార్యదర్శి బద్ధం శంకర్ దాస నాగరాజు ఎలుకంటి లింగం బద్దం మాజీ అధ్యక్షులు నాగరాజు కోశాధికారి గుమ్మడి శ్రీనివాస్ వివిధ సంఘాల నాయకులు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular