కడపజిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15) పోరుమామిళ్ల ఇంటర్ ఫలితాలలో వాగ్దేవి కళాశాల ప్రభంజనం ద్వితీయ , ప్రథమ సంవత్సర ఫలితాలలో తాలూకా స్థాయిలో ఫస్ట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 990/1000, తాలుకా ఫస్ట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 466/470 తాలుకా ఫస్ట్ ప్రధమ సంవత్సరం బైపిసి విభాగంలో 450/455 తాలుకా ఫస్ట్ వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించిందని కళాశాల ప్రిన్సిపాల్ బాల వెంకట రెడ్డి తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ద్వితీయ సంవత్సర



ఎంపీసీ విభాగంలో జి. పవిత్ర,1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి తాలూకా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం బైపిసి విభాగం నందు ఓ అంజలి,1000 మార్కులకు గాను 976 మార్కులు సాధించి కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో లక్ష్మీ దశర్న,470 కి గాను 466 మార్కులు సాధించి తాలూకా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు .ప్రధమ సంవత్సరం బైపిసి విభాగము నందు భానుప్రియ,455 మార్కులకు గాను 450 మార్కులు సాధించి కళాశాల మొదటి ర్యాంకు సాధించింది అన్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి కళాశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాల డైరెక్టర్లు గుర్రపు పుల్లపు నాయుడు, పివి మోహన్ రెడ్డి, నాగరాజు, రమణ, అధ్యాపక బృందం తదితరులు అభినందించారు. కాన్సెప్ట్ ఆధారిత బోధన వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కళాశాల యాజమాన్యం పేర్కొంది.




