📄 ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలం మల్లన్న దర్శనం చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్

శ్రీశైలం మల్లన్న దర్శనం చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్

📰 Generate e-Paper Clip

శ్రీశైలం మల్లన్న దర్శనం చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్
నంద్యాల జిల్లా, శ్రీశైలం, ఏప్రిల్ 23 (ప్రజావాణి):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్ గురువారం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం కల్పించారు.
దేవస్థానం ఈవో శ్రీ ఎం. శ్రీనివాసరావు చైర్మన్ జవహర్‌ను ఆలయ సంప్రదాయాల ప్రకారం సత్కరించారు. అనంతరం స్వామివారి చిత్రపటం మరియు లడ్డు ప్రసాదాలను ఆయనకు అందజేశారు.
ఈ దర్శనంతో చైర్మన్ జవహర్ ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular