📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి.

ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి.

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) కంచికచర్ల చెరువు కట్ట ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో ఇరువురు మృతి చెందిన దుర్ఘటన కంచికచర్ల చెరువు కట్ట దాటిన తర్వాత 65 నెంబర్ జాతీయ రహదారిపై మిశ్రా దాబా వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ తో సహా ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందింది. కంచికచర్ల మండలం కీసర గ్రామం నుండి ఎస్ కే బాబు అనే వ్యక్తి ఆటో సర్వీస్ చేసుకుంటూ కంచికచర్ల వచ్చాడు. కీసర తిరుగు ప్రయాణంలో ఆటోలో అరటి గెలలు వేసుకొని వెళ్తుండగా కంచికచర్ల గ్రామంలోని ప్రణీత కాలనీకి చెందిన పసుపులేటి కిట్టమ్మ నందిగామ వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా కంచికచర్ల శివారులో మిత్ర ఆక్సిన్ కంపెనీ దాటిన తర్వాత మిశ్రా దాబా వద్ద నందిగామ వైపు వెళుతున్న ఇన్నోవా కారు ఆటోని వెనుక నుండి డీ కొనడంతో ఆటో పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది.ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎస్ కె బాబు(45) అక్కడికక్కడే మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న పసుపులేటి కిట్టమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి.చికిత్స నిమిత్తం మహిళను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అందించి,గాయాల తీవ్రత దృష్ట్యా మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ మేరకు కంచికచర్ల ఎస్ఐ పి.విశ్వనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular