📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పోయిన సొత్తులు లభ్యం… స్వామివారికి ప్రత్యేక పూజలు

పోయిన సొత్తులు లభ్యం… స్వామివారికి ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

పోయిన సొత్తులు లభ్యం… స్వామివారికి ప్రత్యేక పూజలు

అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం రాజనాల బండపై సత్తు ప్రమాణాలకు ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన చోటుచేసుకుంది.

 

చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామానికి చెందిన కొంతమంది భక్తులు పోగొట్టుకున్న సొత్తులు తిరిగి లభ్యం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. స్వామివారి అనుగ్రహంతోనే తమకు పోయిన వస్తువులు దొరికాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయానికి చేరుకుని ఆంజనేయస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో ఆలయంపై భక్తుల విశ్వాసం మరింత పెరిగిందని స్థానికులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular