“ఆచార్య జయశంకర్ ఆశయాలు చిరస్మరణీయం”బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు-పాకాల మహిపాల్ రెడ్డి
బెజ్జంకి, ఆగస్టు 6 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, ఆయన అందించిన సిద్ధాంత బలం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలు...