📄 ePaper
Saturday, May 16, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఅమ్మకు అక్షరమాల” – 100 రోజుల వయోజన విద్య కార్యక్రమం..

అమ్మకు అక్షరమాల” – 100 రోజుల వయోజన విద్య కార్యక్రమం..

📰 Generate e-Paper Clip

 

మార్కుక్, మార్చి 29, ప్రజావాణి

మార్కుక్ మండలంలో “అమ్మకు అక్షరమాల” 100 రోజుల వయోజన విద్య కార్యక్రమం ఐకేపీ (ఐకేపీ )  (డీ ఆర్‌ డీ ఏ ) ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడునది.ఈ కార్యక్రమంలో వీఓఏల సమక్షంలో, వాలంటీర్ టీచర్ల (వి టీ ఎస్ ) సహకారంతో మండలంలోని 16 గ్రామ పంచాయతీలలో మొత్తం 1,745 మంది నిరక్షరాస్యులను గుర్తించి,వాళ్ల కి పుస్తకాలు వర్క్‌బుక్స్ అందించి చదువు నేర్పించారు.ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన 970 మందికి మార్చి 29 , ఆదివారం రోజున పరీక్ష నిర్వహించబడునది. అందులో 819 మంది హాజరై పరీక్ష రాశారు. పరీక్ష పత్రాలను వీఓఏలు మూల్యాంకనం చేసి, అర్హత సాధించిన వాళ్ల కి సర్టిఫికెట్లు అందజేయబడతాయి.పరీక్షను విజయవంతంగా నిర్వహించిన వీఓఏలు మరియు ఐకేపీ మార్కుక్ మండల బృందాన్ని ఎంఈఓ వెంకట రాములు,  అభినందించారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం యాదగిరి , సీసీలు కవిత తదితరులు, మండల సీఆర్‌పీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular