📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి

అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి

📰 Generate e-Paper Clip

అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి

పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి

తొర్రూరు
ఆగస్టు 7

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో భారత కాన్సుల్ జనరల్ డా. శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎంతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి కూడా పాల్గొని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక భారతీయ సంఘాల ప్రతినిధులు, ప్రవాస భారతీయులతో ఆప్యాయంగా మమేకమయ్యారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమని, రాష్ట్రంతో వారి అనుబంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ఈ
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ప్రవాస భారతీయులు పరస్పరం అభివాదాలు చేసుకుంటూ ఆత్మీయంగా చర్చలు జరిపారు. ఈ “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం భారతీయ సమాజం, ప్రవాస తెలంగాణ ప్రజలు ప్రజాప్రతినిధుల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular