ఘట్కేసర్ ఏప్రిల్ 24 (ప్రజావాణి) మేడ్చల్ జిల్లా, ఘాట్ కేసర్ సర్కిల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నోజిగూడ పరిధిలో సమ్మర్ క్యాంప్ కార్యక్రమం రోజూ పాఠశాల విద్యార్థులకు (6–10 తరగతి) నిర్వహించబడుతోంది. విద్యార్థులకు ఆటలతో పాటు, మానసిక ఉల్లాసం, ఈ కార్యక్రమాల వల్ల ఉపయోగపడుతుంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. ప్రతాప్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. పి ఈ టి విజయ్ కుమార్ ప్రోత్సాహంతో
ఈ సమ్మర్ క్యాంప్ మే 31 వరకు కొనసాగనుండగా, ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చెస్, క్యారమ్స్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ నిర్వహిస్తున్నారు.
క్రీడా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పి ఈ టి విజయ్ కుమార్, ఉపాధ్యాయులకు విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


