కళ్యాణదుర్గం జూన్ 14 ప్రజావాణి నియోజకవర్గంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం బాటిళ్లపై జరుగుతున్న భారీ దోపిడీని వెంటనే నిలిపివేయాలని YSRCP కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య డిమాండ్ చేశారు.-బెల్ట్ షాపుల్లో మద్యం బాటిళ్లపై రూ.30 నుండి రూ.60 అక్రమ వసూళ్లు వెంటనే ఆపాలి-దోపిడీని ప్రశ్నిస్తే అక్రమ కేసులా? ప్రజా సమస్యలపై వెనక్కి తగ్గేదే లేదు. కళ్యాణదుర్గం ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం కొనసాగుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా ₹30 నుండి ₹60 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని ఆయన మండిపడ్డారు.అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో తలారి రంగయ్య మాట్లాడుతూ.ప్రజలపై జరుగుతున్న ఈ అన్యాయాన్ని మరియు అక్రమ వసూళ్లను ప్రశ్నించినందుకు తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా YSRCP ముందుకు సాగుతుందని,ఇటువంటి బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.”బెల్ట్ షాపుల్లో సాగుతున్న ఈ దోపిడీ వెనుక ఉన్న వారెవరో ప్రజలందరికీ తెలుసు.ఈ అక్రమ వసూళ్లు వెంటనే ఆగాల్సిందే.బాధితుల తరఫున,కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల తరఫున మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది”అని డాక్టర్ తలారి రంగయ్య హెచ్చరించారు.అన్యాయాలపై రాజీలేని పోరాటం చేస్తూ,కళ్యాణదుర్గం ప్రజల గొంతుకగా నిలుస్తామని ఆయన పునరుద్ఘాటించారు




