పోరుమామిళ్ల (ప్రజావాణి జులై 06) మండలం సంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రామేశ్వరం గ్రామం ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడి వైఎస్సార్‌సీపీ లేఅవుట్‌లో ఎటువంటి హక్కు పత్రాలు, ప్రభుత్వ అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ కట్టడాల వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుంటే, వాటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వీఆర్వో సమాధానంపై సర్వత్రా విస్మయం!గతంలో ఇదే లేఅవుట్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో, స్థానిక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ స్వయంగా రంగంలోకి దిగి వాటిని నిలిపివేశారు. అయితే, ఇప్పుడు అదే స్థలంలో మళ్లీ పనులు ముమ్మరంగా సాగుతుండటం గమనార్హం. దీనిపై స్థానికులు, విలేకరులు సదరు వీఆర్వోను వివరణ కోరగా, “ఆ నిర్మాణాల గురించి నాకు ఏమీ తెలియదు” అంటూ బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. గతంలో తానే స్వయంగా నిలిపివేసిన చోట మళ్లీ ఇటుకలు లేస్తున్నా ‘నాకు తెలియదు’ అనడం వెనుక ఉన్న అసలు మర్మమేంటో ప్రభుత్వానికే తెలియాలని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.సెలవు దినాలే ఆసరా.అధికారుల పరోక్ష ప్రోత్సాహం?అక్రమార్కులు ఇళ్ల నిర్మాణాల కోసం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండే శని, ఆదివారాలు లేదా ఇతర పండుగ దినాలను ఎంచుకుని రాత్రికి రాత్రే గోడలు లేపుతున్నారు.ఈ వ్యవహారం వెనుక కొందరు స్థానిక రెవెన్యూ అధికారుల పరోక్ష హస్తం ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. మీరు నిర్మించుకోండి… ఒకవేళ ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత సంగతి మేము చూసుకుంటాం”అంటూ కొందరు అధికారులు అక్రమార్కులకు కొండంత అండగా నిలుస్తున్నారని గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్ చేస్తే “మేము అందుబాటులో లేము” అని దాటవేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.చట్టం ఏం చెబుతోంది? అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు, పంచాయతీ స్థలాలు లేదా లేఅవుట్లలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఇలాంటి అక్రమ కట్టడాలను ప్రారంభ దశలోనే గుర్తించి, నోటీసులు జారీ చేసి కూల్చివేయడం రెవెన్యూ మరియు పంచాయతీ అధికారుల ప్రాథమిక బాధ్యత. కానీ ఇక్కడ మాత్రం పునాదుల నుంచి గోడలు పూర్తయి, పైకప్పు దశకు చేరుకుంటున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు చేతులు మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.సంచర్ల పంచాయతీ రామేశ్వరం గ్రామంలో జరుగుతున్న ఈ భూఆక్రమణలు, అక్రమ కట్టడాలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న సూత్రధారులపై సమగ్ర విచారణ జరపాలి.విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన, లేదా అక్రమార్కులకు సహకరించిన సంబంధిత వీఆర్వో వీఆర్ఏ ల పాత్రపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.పంచాయతీ పరిధిలోని వివాదాస్పద లేఅవుట్లలో తక్షణమే ప్రభుత్వ సర్వే నిర్వహించి, అక్రమంగా వెలిసిన అన్ని నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ భూములను కాపాడాలి.అధికారులు ఇప్పటికైనా తమ నిద్ర మత్తు వీడి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతారా,లేక అక్రమార్కులకు వత్తాసు పలుకుతూనే ఉంటారా అనేది వేచి చూడాలి.
అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తున్నదెవరు..? సంచర్లలో యథేచ్ఛగా నిర్మాణాల పర్వం
0
28
RELATED ARTICLES



