అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తున్నదెవరు..? సంచర్లలో యథేచ్ఛగా నిర్మాణాల పర్వం

పోరుమామిళ్ల (ప్రజావాణి జులై 06) మండలం సంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రామేశ్వరం గ్రామం ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడి వైఎస్సార్‌సీపీ లేఅవుట్‌లో ఎటువంటి హక్కు పత్రాలు, ప్రభుత్వ అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ కట్టడాల వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుంటే, వాటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వీఆర్వో సమాధానంపై సర్వత్రా విస్మయం!గతంలో ఇదే లేఅవుట్ పరిధిలో జరుగుతున్న అక్రమ...