📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialఅంగన్‌వాడీ కేంద్రంలో బాలామృతం, కోడిగుడ్లు పంపిణీ చేసిన సర్పంచ్ మల్లేష్ గౌడ్

అంగన్‌వాడీ కేంద్రంలో బాలామృతం, కోడిగుడ్లు పంపిణీ చేసిన సర్పంచ్ మల్లేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

గుల్లకోట అంగన్‌వాడీ కేంద్రంలో బాలామృతం, కోడిగుడ్లు పంపిణీ

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 01 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని అంగన్‌వాడీ-2 కేంద్రంలో బుధవారం చిన్నారులకు, గర్భిణీలకు బలవర్ధకమైన ఆహారాన్ని పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ గొల్లపల్లి మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు బాలామృతం ప్యాకెట్ల తో పాటుగా కోడిగుడ్లను అందజేశారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఒక బాలామృతం ప్యాకెట్ తో పాటుగా, 16 కోడి గుడ్లు ప్రతి నెలకి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ అభివృద్ధిలో, అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణలో నిరంతరం సహకరిస్తున్న సర్పంచ్ మల్లేష్ గౌడ్‌ను అంగన్‌వాడీ టీచర్ భూసరపు భూలక్ష్మి, వెల్ఫేర్ బాయ్ కవిత, పిల్లల తల్లిదండ్రులు సర్పంచ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బందితో పాటు స్థానిక గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular