అంగన్‌వాడీ కేంద్రంలో బాలామృతం, కోడిగుడ్లు పంపిణీ చేసిన సర్పంచ్ మల్లేష్ గౌడ్
గుల్లకోట అంగన్‌వాడీ కేంద్రంలో బాలామృతం, కోడిగుడ్లు పంపిణీ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 01 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని అంగన్‌వాడీ-2 కేంద్రంలో బుధవారం చిన్నారులకు, గర్భిణీలకు బలవర్ధకమైన ఆహారాన్ని పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ గొల్లపల్లి మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు బాలామృతం ప్యాకెట్ల తో పాటుగా కోడిగుడ్లను అందజేశారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉన్న...