📄 ePaper
Friday, April 3, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetకోదాడలో బీజేపీ బలోపేతమే లక్ష్యం.. కవితా రెడ్డి నియామకంతో బీజేపీలో నూతనోత్సాహం.   సమన్వయంతో...

కోదాడలో బీజేపీ బలోపేతమే లక్ష్యం.. కవితా రెడ్డి నియామకంతో బీజేపీలో నూతనోత్సాహం.   సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తాం..

📰 Generate e-Paper Clip

కోదాడలో బీజేపీ బలోపేతమే లక్ష్యం..

కవితా రెడ్డి నియామకంతో బీజేపీలో నూతనోత్సాహం.

సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తాం..

రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండారు కవితా రెడ్డి..

కోదాడ, ఏప్రిల్ 02/ ప్రజావాణి

 

కోదాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండారు కవితా రెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా కవితా రెడ్డిని అధిష్టానం నియమించిన సందర్భంగా కోదాడ నియోజకవర్గ బిజెపి పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను అందరినీ కలుపుకొని పోయి సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే రోజుల్లో కోదాడలో కమలం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోడీ పాలనలో భారత్ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోందని అన్నారు. తనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు రాం చందర్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాతులూరి హనుమంతరావు, యరగని కళావతి, రాధాకృష్ణ, గోదేశీ లక్ష్మణ్, సతీష్, బసవయ్య, వీరబాబు, శంకర్ నాయక్, నాగేశ్వరరావు, రవికుమార్,శంకర్, సురేష్, జల్ల జనార్ధన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular