📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రామేశ్వరానికి మళ్ళీ ..ఆర్టీసీ.. కళ వచ్చేనా.? బస్సు లేక ప్రయాణికుల అవస్థలు.!

రామేశ్వరానికి మళ్ళీ ..ఆర్టీసీ.. కళ వచ్చేనా.? బస్సు లేక ప్రయాణికుల అవస్థలు.!

📰 Generate e-Paper Clip

ప్రొద్దుటూరుప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1)చింత చచ్చినా పులుపు చావలేదు.అన్నట్టుగా,గతంలో ఉన్న సౌకర్యాలను తలుచుకుంటూ నేడు రామేశ్వరం వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఒకప్పుడు పల్లె వెలుగు,ఎక్స్‌ప్రెస్ బస్సులతో కళకళలాడిన రామేశ్వరం వీధులు,నేడు ఆర్టీసీ బస్సు జాడ లేక వెలవెలబోతున్నాయి.​గుర్తుకొస్తున్న గత వైభవం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రామేశ్వరం నుంచి కేవలం స్థానిక ప్రాంతాలకే కాకుండా,విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులు నడిచేవి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి.గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్.అన్నట్టుగా మారిపోయింది.. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినా,ఆ సదుపాయం పొందాలంటే రామేశ్వరం వాసులు కిలోమీటర్ల మేర ప్రయాణించి పాత బస్టాండ్ లేదా బి.బి.ఎస్ థియేటర్ కొత్త ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకోవాల్సి వస్తోంది.ఆటోల భారం.సామాన్యుడికి దూరం.బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటో డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.అదుపు లేని గుర్రం.అడ్డూఅదుపు లేని వసూళ్లు.అన్న చందంగా ప్రయాణికుల నుంచి భారీగా బాడుగలు వసూలు చేస్తున్నారు.ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వెళ్లడానికి ఆర్టీసీలో 30 రూపాయలే ఖర్చవుతుంటే,రామేశ్వరం నుంచి పట్టణంలోకి వెళ్లడానికి ఆటోవాలాలు ఏకంగా 40 నుండి 60 రూపాయలు అడుగుతున్నారు.సమయం కొద్దిగా మించితే చాలు,అడిగినంత ఇవ్వకపోతే ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ విసుగు ప్రదర్శిస్తున్నారు.సామాన్య కూలీలు,చదువుకునే విద్యార్థులు ఈ ఖర్చులు భరించలేక,చేతిలో పైసా లేదు.చేరాల్సిన చోటు దూరము.అని వాపోతున్నారు.ఎమ్మెల్యే గారికి విన్నపం.గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని రామేశ్వరం ప్రజలు కోరుతున్నారు.రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం వదలలేదు.అన్నట్టుగా తమ ప్రయాణ కష్టాలు ఉండకూడదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు, రామేశ్వరానికి తక్షణమే ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించి, తమ ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.పెద్దాయన.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular