📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఅకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

📰 Generate e-Paper Clip

 

బిఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షులు

పాకాల మహిపాల్ రెడ్డి

బెజ్జంకి, ఏప్రిల్సి 1(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలిపోవడంతో పాటు మొక్కజొన్న పంట కూడా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు.అలాగే మామిడికాయలు రాలిపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లిందన్నారు.ఈ పరిస్థితుల్లో అధికారులు వెంటనే పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆయన కోరారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యల పరిష్కారంలో భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.బాధిత రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular