📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetపోలీస్ వీధి నిర్వహణలో ప్రతిభ – హెడ్ కానిస్టేబుల్ రాజగోపాల్ రెడ్డికి ప్రశంసాపత్రం

పోలీస్ వీధి నిర్వహణలో ప్రతిభ – హెడ్ కానిస్టేబుల్ రాజగోపాల్ రెడ్డికి ప్రశంసాపత్రం

📰 Generate e-Paper Clip

విధి నిర్వహణలో ప్రతిభ – హెడ్ కానిస్టేబుల్ రాజగోపాల్ రెడ్డికి ప్రశంసాపత్రం

బెజ్జంకి, మార్చి31(ప్రజావాణి)

వీధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజగోపాల్ రెడ్డి (PC 877)ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తనపై ఉంచిన విశ్వాసానికి ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ఆయన సేవలను కొనియాడుతూ, ఈ గుర్తింపు మరింత ఉత్సాహాన్ని కలిగించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular