*భువనగిరిలో హృదయ విధారక ఘటన….*

*4 ఏళ్ల బాబుపై కుక్క దాడి.*
*కన్ను గుడ్డు బయటపడేంత తీవ్రంగా కరిసిన కుక్క.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి మార్చి 26*
భువనగిరి పట్టణంలో చిన్నారిపై కుక్క దాడి చేసిన ఘటన కలకలం రేపింది. భూగబట్ల శ్రావణి , రాహుల్ తారకరామారావు ఏరియాలో నివాసం ఉంటున్న దంపతుల 4 ఏళ్ల కుమారుడిపై కుక్క దాడి చేసి కన్ను గుడ్డు బయటపడేంత తీవ్రంగా గాయపరిచింది. మాజీ కౌన్సిలర్ పంగ రెక్క స్వామి వెంటనే స్పందించి , చిన్నారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నీలాఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సమస్యపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీ ద్వారా స్ట్రే డాగ్స్ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలి.
పిల్లల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు వెంటనే స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.




