📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నాయనపల్లె లో సీతారామచంద్ర స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట

నాయనపల్లె లో సీతారామచంద్ర స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట

📰 Generate e-Paper Clip

కడపజిల్లా ప్రజావాణిన్యూస్(మార్చి26) బద్వేల్ నియోజకవర్గం,కాశినాయన మండలం, నాయనపల్లె (ఎస్సీ కాలనీ) గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం ఈరోజు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర పుణ్యకార్యానికి బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ కే. రితేష్ రెడ్డి గారు తన మాతృమూర్తి, మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కే. విజయమ్మ గారు మరియు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొజ్జ రోషన్ గారితో కలిసి హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. గ్రామస్తులు వీరికి సంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆ సీతారాముడిని ప్రార్థించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.