📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamయువత డ్రగ్స్ కు గురి కావద్దు..!

యువత డ్రగ్స్ కు గురి కావద్దు..!

📰 Generate e-Paper Clip

యువత డ్రగ్స్ కు గురి కావద్దు..!

 

డిసిపి(లా అండ్ ఆర్డర్) జి.ప్రసాద్ రావు

 

నేలకొండపల్లి ప్రతినిధి, మన ప్రజావాణి

 

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోనినేలకొండపల్లి మండల కేంద్రంలో డ్రగ్స్ రహిత న ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అడిషనల్ డిసిపి (లా అండ్ ఆర్డర్) జి. ప్రసాదరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు.సమాజం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.యువత డ్రగ్స్ వైపు ఎప్పుడూ వెళ్లకూడదని, భవిష్యత్తు కోసం సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు.ప్రభుత్వం డ్రగ్స్ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులైతేనే సమాజం సన్మార్గంలో నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టీజీ టీం డిసిపి లక్ష్మి, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి,కూసుమంచి సిఐ సంజీవ్, నేలకొండపల్లి ఎస్సై పి. సంతోష్ నే లకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు స్థానిక తహసిల్దార్ కె వెంకటేశ్వర్లు వ్యవసాయ అధికాణి రాధా పలువురు ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.